
అనగనగా ఒక ఊర్లో ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి. అక్కడ ఎలుకలు ఎక్కువగా వుండటం తో కొత్తగా ఒక పిల్లి కూడా చేరింది. అది రోజూ బోలెడన్ని ఎలుకలను చంపి తినేది. క్రమంగా ఎలుకల సంఖ్య తగ్గిపోయింది.ఎలుకలు పిల్లి భయానికి బయటకి రావటమే మానేశాయి ఇలా వుంటే తాము ఆకలితో మాడిపోయి ఐన చనిపోతామని భయపడి, ఒకరోజు ఎలుకలన్నీ సమావేసమయ్యాయి. ఆ సమావేసంలో "పిల్లి మెడలో గంట కడితే... తాము చావకుండా తప్పించుకోవచ్చు" అని అనుకున్నాయి.
అందుకు తమలో నుండి ఒక తెలివైన ఎలుకను ఎన్నుకున్నాయి.
ఒకరోజు పిల్లి బాగా నిద్రపోతుంది. అప్పుడు ఆ తెలివైన ఎలుక వచ్చి పిల్లి మేడలో గంట కట్టింది.
అప్పట్నించి ఎలుకలన్నీ గంట శబ్దం వినబడగానే పారిపోయి దాక్కుంటున్నాయి. పిల్లికి ఆహారం దరకక ఆ ఇంటినుంచి వెళ్లి పొయిoది.
పిల్లి వెళ్లి పోయినందుకు ఎలుకలు సంతోషించాయి
No comments:
Post a Comment